ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 7:03 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

420హమీల మొదటి ముద్దాయి దుద్దిళ్ల శ్రీధరే…

420హమీల మొదటి ముద్దాయి దుద్దిళ్ల శ్రీధరే…

  • మానీఫెస్టో చూసి రాష్ట్రమంతా నవ్వుతున్నరు
  • అబద్దాలతో మంథని పరువు తీస్తున్న దుద్దిళ్ల
  • తండ్రి ఆశయాలంటే అక్రమ కేసులు పెట్టించడమా
  • ఆరు గ్యారెంటీలు అమలు చేసినంకనే ఓట్లకు రావాలే
  • మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
  • ⁠పెద్దపల్లి ప్రతినిధి అర్జున్ సమాచార్ సెప్టెంబర్ 02:

రాష్ట్రంలో 420హమీలపై ఎక్కడైనా కేసులు పెట్టాల్సి వస్తే దానిలో మొదటి ముద్దాయి దుద్దిళ్ల శ్రీధరేనని, ఆయనపై కేసు నమోదు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వేయి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు బుధవారం మంథని పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన తో నిరసన కార్యక్రమం చేపట్టి, బాకీ కార్డులు పంపిణీ చేశారు… ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వేయి రోజులు గడిచినా ఒక్క హమీ నెరవేర్చని చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని దుయ్యబట్టారు. చదువుకున్న వ్యక్తి అని తండ్రి కొడుకుల రూపాలు చూసి నియోజకవర్గ ప్రజలు ఎనిమిదిసార్లు ఓట్లు వేస్తే మంథని ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను దుద్దిళ్ల కుటుంబం మోసం చేసిందని విమర్శించారు. గొప్పగా మానీఫెస్టో రాసిన దుద్దిళ్ల శ్రీధర్‌ ఆ మానీఫెస్టోను మర్చిపోయాడని, హమీలు అమలు చేయాలని ప్రశ్నించిన వారిపై పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే పోలీసులకు చెప్పామని అన్నాతమ్ముళ్లు చెప్పినట్లు వింటే అబాసుపాలు అవుతారని,అయినా కేసులు పెట్టి కోర్టులో చివాట్లు తింటున్నారని ఆయన తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దగా పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేలా మానీఫెస్టో రూపొందించామని దుద్దిళ్ల శ్రీధర్‌ గొప్పలు చెప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని హమీలు అమలు చేసి తెలంగాణను బంగారు బాటలో నడిపిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ప్రతీసారి తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న దుద్దిళ్ల శ్రీధర్‌ అసలు తండ్రి ఆశయాలేంటో చెప్పడం లేదన్నారు. సొంత గ్రామమైన ధన్వాడ ప్రభుత్వ పాఠశాలలో బేంచీలు, ఫ్యాన్లు సౌకర్యాలు లేక ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారని, కనీసం పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని, ఒక బేంచీ వేయించాలని దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఆలోచన చేయాలేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టించి జైలు పాలు చేయడమేనా మీ తండ్రి ఆశయాలని ఆయన విమర్శించారు. 420హమీలు కాకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి మహిళలకు 2500, 500లకే గ్యాస్‌ సిలిండర్‌లు ఇస్తామని, పించన్‌లు పెంచుతామని చెప్పారని, రైతుభరోసా, రైతు కూలీలకు 12వేలు, క్వింటాల్‌ వడ్లకు బోనస్‌, గృహజ్యోతి అని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయకుండా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటాడని, మంత్రులు ఇక్కడికి వచ్చి మరీ గొప్పలు చెప్పారని, ముఖ్యమంత్రి ఏం చెప్పాలన్నా దుద్దిళ్ల శ్రీధర్‌ ద్వారానే చెప్పుకుంటామని పొగిడారని, కానీ అందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి 3వేల ఇందిరమ్మ ఇండ్లు తెస్తే మంథని ఎమ్మెల్యే మంత్రి అయి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడై 3వేల ఇండ్లు తెచ్చాడని ఆయన ఎద్దేవా చేశారు. అంటే మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని తమ్ముడికి హైదరాబాద్‌లో నాలుగు ఆఫీసులు పెట్టించి వేల కోట్లు సంపాదించుకోవడానికేనా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో ఏటీఎం కార్డులు చూపించి యువతను, విద్యార్ధులను మోసం చేసిన ఘనత దుద్దిళ్లదేనని అన్నారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏది అని అడిగితే కేసులు పెట్టించాడని ఆయన గుర్తు చేశారు. దేశంలో చదువుకున్న సన్నాసి ఎవరైనా ఉన్నారంటే అది దుద్దిళ్ల శ్రీధరేనని ఆయన విమర్శించారు. మంథని ప్రజలు ఎనిమిదిసార్లు ఓట్లు వేసి గెలిపిస్తే మంథనికి అపకీర్తి తీసుకువస్తున్నారని, మానీపెస్టో రాసింది మంథని ఎమ్మెల్యేనా అని రాష్ట్ర ప్రజలంతా నవ్వుకుంటున్నారని అన్నారు. అబద్దాలతో ఇంకా మంథని ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడని, హమీలు అమలు చేయకపోగా విదేశాలకు పోయి సిపాయి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మానీఫెస్టోను ప్రజలకు చూపిస్తామని అన్నారు. మంథని అభివృద్ది, భవిష్యత్‌ గురించి ఏనాడు ఆలోచన చేయడం లేదని, రోడ్ల విస్తరణ పేరుతో వ్యాపారాలను రోడ్డున పడేశాడని వాపోయారు. కూల్చీవేతల్లో టౌన్‌లో ఒక న్యాయం రోడ్డు మీద వాళ్లకు ఒక న్యాయం చేస్తున్నారని, పట్టణంలో రోడ్ల విస్తరణ సమయంలో పరిహారం ఇచ్చారని, ఇక్కడ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. వ్యాపారులు సైతం పరిహారం కోసం ప్రశ్నించకుండా ఉంటున్నారని, కేవలం దుద్దిళ్ల శ్రీధర్‌ , కాంగ్రెస్‌ పార్టీ అంటే భయపడుతున్నారని ఆయన అన్నారు. అధికారులు, పోలీసులను వాడుకుని ఎలా భయపెడుతున్నాడో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు. నియోజకవర్గాన్ని అబాసుపాలు చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతనే ఓట్లు అడుగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్న మంథని ఎమ్మెల్యే…జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌, జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌, భూపాలపల్లి

ఆరు గ్యారెంటీలు, 420హమీలు అమలు చేస్తామని మంథని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత మంథని ఎమ్మెల్యేకు దక్కుతుందని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌ అన్నారు. వంద రోజుల్లో మానీఫెస్టోలోని ఆరు గ్యారెంటీలు, 420హమీలు అమలు చేస్తామని గద్దెనెక్కి వేయి రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందని కొంత సమయం ఇచ్చామని, కానీ 1000 రోజులు గడిచిపోయాయని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో కేవలం మహలక్ష్మి తప్ప ఏది అమలు చేయడం లేదన్నారు. వేయి రోజుల్లో పేదల ఇండ్లు కూల్చివేయడం, అక్కరకు రాని యాప్‌లతో రైతులను ఎరువుల కోసం ఇబ్బదులుకు గురి చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలనే ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్‌ వస్తే కష్టాలు వస్తయని ఆనాడు కేసీఆర్‌ చెప్పాడని, నమ్మితే మోసపోయి గోసపడుతమని ప్రజలు గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారని ఆమె అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420హమీలు అమలు చేసే దాకా వదిలిపెట్టమని, మంథని ఎమ్మెల్యే 20ఏండ్లుగా అబద్దాలతోనే గద్దెనెక్కుతున్నాడని, ఈసారి మానీఫెస్టో రాసి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును 20ఏండ్లు వెనక్కి తీసుకెళ్లిన చరిత్ర ఆయనదేనని అన్నారు. ఐటీ మంత్రి అయి పది మందికి ఉద్యోగ ఉపాధి కల్పించలేని అసమర్త మంత్రి శ్రీధర్‌ అని ఆమె విమర్శించారు. ఆరు గ్యారెంటీలు నేనే రాసిన మొదట మన నియోజకవర్గంలోనే అమలు చేస్తామని ఇంటింటికి పంచిపెట్టి ఓట్లు వేయించుకున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతి మహిళ హమీలు, గ్యారెంటీలపై నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. అబద్దాల సీఎం, మంత్రులను గద్దె దించేవరకు పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు…..